గ్లోబల్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15′ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనే అనౌన్స్మెంట్ తోనే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ బజ్ ని మరింత పెంచుతూ చరణ్ ఓల్డ్ లుక్ లీక్ అవ్వడం, యంగ్ లుక్ లో స్మార్ట్ గా ఉండడం, మధ్యలో ఆఫీసర్ గా సూటు బూటు వేసుకొని చరణ్ కనిపించడంతో… గేమ్ చేంజర్ సినిమా శంకర్ మీటర్ లో ఉంటూ చరణ్ ని ఎలివేట్ చేసేలా ఉంటుందని అందరు నమ్మారు కానీ ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు.
శంకర్ ఇండియన్ 2 సినిమాపై ద్రుష్టి పెట్టి గేమ్ ఛేంజర్ సినిమాని కాస్త డిలే చేస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి సమయంలో గేమ్ ఛేంజర్ సినిమా నుంచి సాంగ్ లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ లో అసహనం మరింత పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో అసలు గేమ్ ఛేంజర్ సినిమా ఎక్కడి వరకు షూటింగ్ జరుపుకుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ నెగటివ్ ట్రెండ్ క్రియేట్ చేసారు. ఈ ట్రెండ్ కి కూడా మేకర్స్ రెస్పాండ్ అవ్వలేదు. 2023 సంక్రాంతి, రిపబ్లిక్ డే, శివరాత్రి, రామ్ చరణ్ బర్త్ డే, ఉగాది, ఇండిపెండెన్స్ డే, వినాయకచవితి ఇలా అకేషన్స్ అన్నీ అయిపోతున్నాయి కానీ గేమ్ చేంజర్ సినిమా నుంచి మాత్రం అప్డేట్ బయటకి రావట్లేదు. దీంతో ఫ్యాన్స్ చేసేదేమి లేదు అని ప్రొడక్షన్ హౌజ్ పై డిపెండ్ అవ్వకుండా తమ సంతోషం కోసం AI టెక్నాలిజీకి జై కొడుతున్నారు. AI టెక్నాలజీ వాడి రామ్ చరణ్ కొత్త ఫోటోస్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇందులో చరణ్ హెలికాఫ్టర్ నుంచి దిగుతున్నట్లు ఉన్న ఫోటో అయితే మస్త్ మాస్ అండ్ క్లాస్ గా ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ IAS ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు కాబట్టి ఈ AI ఫోటోస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అఫీషియల్ గా రిలీజ్ చేసారా అనిపించే రేంజులో ఉన్న ఈ ఫోటోస్ ఫ్యాన్స్ ని కాస్త ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి దిల్ రాజు, శంకర్ అండ్ టీమ్… కనీసం దసరా పండగకైనా అప్డేట్ ఇస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి.