Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. భారీ విజయంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబట్టి.. సూపర్ స్టార్ సత్తాను మరోసారి చూపించింది. గతకొన్నేళ్ళుగా రజినీకి సరైన హిట్స్ అందలేదు. జైలర్ సినిమాతో రజినీ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్లు సాధించి.. రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రజినీని ఏ డైరెక్టర్ ఇంత హుందాగా చూపించలేదని, అస్సలు రజినీ లుక్ కానీ, ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుస సక్సెస్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో రజినీ.. డైరెక్టర్ ను అవమానించాడంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Vijay Antony: అప్పుడు కన్నతండ్రి.. ఇప్పుడు కన్న కూతురు.. విజయ్ కే ఎందుకిలా..?
ఏ సినిమాను అయినా ఒక డైరెక్టర్ తన కథను నమ్మి సినిమా తీస్తాడు. సినిమా ముందు ఎలా ఉన్నా.. పూర్తీ అయ్యి.. రిలీజ్ కు వచ్చేసరికి అది హిట్ అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలిసిపోతుంది. కథను నమ్మి డైరెక్టర్ ఎలా అయితే తీసాడో.. హీరో కూడా కథను అలాగే నమ్మాలి. కానీ, రజినీ మాత్రం జైలర్ సినిమా హిట్ కాదు అని నమ్మాను అని చెప్పడం ఏం బాలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. “రీ రికార్డింగ్ పూర్తి కాక ముందు నేను, నెల్సన్ స్నేహితుడు, సన్ పిక్చర్స్ కి చెందిన వ్యక్తి సినిమా ను చూశాం. నెల్సన్ స్నేహితుడికి సినిమా బాగా నచ్చింది, సూపర్ హిట్ ఖాయం అన్నాడు. నువ్వు నెల్సన్ స్నేహితుడివి కనుక అలా అనిపిస్తుంది. సినిమా ఎబో యావరేజ్ అన్నాను.. సినిమా పూర్తిఅయ్యాక చాలా అద్భుతంగా ఉందని” చెప్పుకొచ్చాడు. అయితే రీ రికార్డింగ్ అయ్యాక.. అంటే అనిరుధ్ మ్యూజిక్ వలనే సినిమా హిట్ అయ్యిందని, డైరెక్టర్ ది ఏమి లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. దీంతో రజినీపై అభిమానులు మండిపడుతున్నారు. సినిమా హిట్ అయ్యాక కూడా ఇలా డైరెక్టర్ గురుంచి తక్కువ చేసి మాట్లాడడం బాగోలేదని, జైలర్ లాంటి హిట్ ఇస్తే.. డైరెక్టర్ ను అవమానించడం భావ్యమా తలైవా..? అంటూ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.