Kantara: కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒక్క కన్నడనాటనే కాకుండా అన్ని భాషల్లోనూ సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాకు అబిమనులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా రిషబ్ శెట్టిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రభాస్ తో సహా స్టార్ హీరోలందరూ ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాను వీక్షించి రిషబ్ ను మెచ్చుకున్నారు. తన ఇంటికి పిలిచి మరీ ఆయనతో ముచ్చటించారు. సినిమా చాలా బావుందని తెలిపిన తలైవా.. అంతటి మంచి సినిమా తీసినందుకు రిషబ్ కు బంగారు గొలుసు ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్నీ రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెమొరీబుల్ డే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా తర్వాత రిషబ్ ఏ సినిమాను ఒప్పుకోలేదు. కొన్నిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఆ తరువాత కాంతార 2 కథను రాస్తానని ఆయన అధికారికంగా తెలిపాడు.