సూపర్ స్టార్ రజినీకాంత్ అయిదేళ్ల తర్వాత జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. రిలీజ్ కి పది రోజుల ముందు వరకూ అసలు అంచనాలు లేని జైలర్ సినిమా, ఆడియో లాంచ్ తో గేర్ మార్చి భారీ హైప్ ని సొంతం చేసుకుంది. 2023 భాష సినిమా అనిపించే రేంజులో అంచనాలు సొంతం చేసుకున్న జైలర్ మూవీ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ ర్యాంపేజ్ కి క్రియేట్ చేసింది. కోలీవుడ్ లో రోబో 2.0 తర్వాత సెకండ్ ప్లేస్ నిలబడే రేంజులో జైలర్ సినిమా కలెక్షన్స్ ని రాబట్టింది. 650 కోట్లని రాబట్టిన జైలర్, రజినీకాంత్ టైమ్ అయిపొయింది అని మాట్లాడే ప్రతి ఒక్కరినీ సైలెంట్ చేసేసింది. ఎన్ని ఏళ్లు హిట్ లేకపోయినా రజినీకాంత్ అనే వాడు హిట్ కొడితే దాని రీసౌండ్ ఇండియా మొత్తం వినిపిస్తోందని జైలర్ సినిమా ప్రూవ్ చేసింది.
జైలర్ సినిమా మత్తులో నుంచి రజినీకాంత్ ఫ్యాన్స్ బయటకి రాకముందే… రజినీ నుంచి రెండు సాలిడ్ అనౌన్స్మెంట్స్ బయటకి రానున్నాయి. తలైవర్ 170 మూవీ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి ఫుల్ అప్డేట్స్ ఈరోజు బయటకి రానున్నాయి. అమితాబ్ కూడా నటించిన తలైవర్ 170 సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ తో పాటు ఈరోజు బయటకి రానున్న మరో అనౌన్స్మెంట్ ‘లాల్ సలామ్’ సినిమా గురించి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి లాల్ సలామ్ సినిమా నుంచి రజినీకాంత్ కి సంబంధించిన అప్డేట్ బయటకి రానుంది. ఇప్పటికే ఈ మూవీలో రజినీకాంత్ ‘మొయినుద్దీన్ భాయ్’గా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ కి కూడా రిలీజ్ చేసారు మేకర్స్. మరి ఈసారి లాల్ సలామ్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రానుందో చూడాలి. ఈ రెండు సినిమాల అప్డేట్స్ బయటకి వస్తే రజినీకాంత్ ఫ్యాన్స్ ఈరోజు సోషల్ మీడియాని కబ్జా చేయడం గ్యారెంటీ.