థియేట్రికల్ ట్రైలర్ విడుదలతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” మ్యానియా మొదలైంది. గత రెండు రోజుల్లో వివిధ నగరాల్లో క్విక్ ఫైర్ ప్రెస్ మీట్‌లకు హాజరు కావడం ద్వారా మేకర్స్ కూడా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. రోజులు గడిచేకొద్దీ హైప్ పెరుగుతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘బాహుబలి 2’ ప్రీమియర్‌లను ప్రదర్శించగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. కాబట్టి “ఆర్ఆర్ఆర్” కోసం కూడా అదే ఫార్ములా ఫాలో అవుతారని భావిస్తున్నారు.
Read Also : తారక్ ను ముడిపెడుతూ ఏపీ టికెట్ రేట్లపై ప్రశ్న… నిర్మాత ఏమన్నాడంటే?
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిని ఇదే ప్రశ్న అడిగారు. ప్రస్తుతం పెయిడ్ ప్రీమియర్స్‌పై ఎలాంటి ప్లాన్‌లు లేవని, అయితే డిస్ట్రిబ్యూటర్లతో, నిర్మాతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. “పంపిణీదారులు, మా నిర్మాత ఓకే అంటే మేము ఖచ్చితంగా ప్రీమియర్‌లను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాము” అని రాజమౌళి అన్నారు. విడుదలకు కొన్ని రోజుల ముందే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక “ఆర్ఆర్ఆర్”లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.