అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో సిరివెన్నెల రాసిన “దోస్తీ” పాట, దానికి సంబంధించి ఆయనతో ఆ సందర్భం, సమయం ఎలా జరిగింది? అనే ప్రశ్న ఎదురైంది రాజమౌళికి.
Read Also : టాలీవుడ్ స్టార్ హీరోలపై అలియా కంప్లైంట్
దానికి జక్కన్న స్పందిస్తూ “అది చెప్పాలంటే సినిమా చెప్పాల్సి వస్తుంది. అవన్నీ చెప్పలేను. కానీ శాస్త్రి గారితో జర్నీ ఫెంటాస్టిక్ అండి. ఇక్కడ ఈ సిట్యుయేషన్ వస్తుంది. పాట రాయాలంటే ఆయన అవతలకి పొమ్మంటారు. ఆయన మొత్తం కథ చెప్పాలి ? పాత్రలు, ఆ సాంగ్ సందర్భం, కథ అక్కడికి వచ్చే సరికి హీరోల మెంటల్ స్టేజ్ ఎలా ఉంటుంది ? అన్నీ చెప్పాలి. అప్పుడు ఆయన ఆలోచించుకుని, ఆయన కలల్లోంచి దాని తాలూకూ లిరిక్స్ వస్తాయి. మిగతా వాళ్ళు వేరు.. సిరివెన్నెల వేరు… శాస్త్రిగారితో పాట రాయించుకోవాలంటే కనీసం నెలరోజులు టైం ఇవ్వాలి. మిగతా వాళ్లకు ఆయన ఎలా రాస్తారో తెలీదు. కానీ నాకైతే మినిమం 30 రోజులు…” అని అన్నారు. రీసెంట్ గా దిగ్గజ లిరిసిస్ట్ సిరివెన్నెల కన్నుమూసిన విషయం తెలిసిందే.