Raj Tarun: హీరో రాజ్ తరుణ్ లావణ్య అంశం గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ప్రేమలో పడి తనను మోసం చేస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్ మీద లావణ్య పోలీసు కేసు నమోదు చేసింది. ఆ తరువాత మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరూ వేర్వేరుగా లావణ్య మీద కేసులు నమోదు చేశారు. ఇక ఈ వివాదం మొదలైన తరువాత ఒకే రోజు మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ పోలీసులు నోటీసులు ఇచ్చినా వారి ముందు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉంటూ వచ్చారు.
Also Read:Tollywood Producer: స్కెచ్చేసి 40 కోట్లు కొట్టేసిన టాలీవుడ్ నిర్మాత
ఇక ఆయన హీరోగా మాల్వి మల్హోత్రా హీరోయిన్గా నటించిన తిరగబడరా సామి అనే సినిమా ఆగస్టు 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కు రాజ్ తరుణ్ సహా మాల్వి మల్హోత్రా హాజరయ్యారు. నేను ఆరోపణలు చేయడం లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. నేను లీగల్ గానే ముందుకు వెళ్తా. మీరు ఇన్ని రోజులు ఆరోపణలు వింటున్నారు కానీ ఆధారాలు చూపించడం చూశారా? నేను నా మీద ఆరోపణలు వచ్చిన రోజే వచ్చి అన్ని మీడియా సంస్థలతో మాట్లాడాను. ఆరోజు మాట్లడినవి అన్నీ నిజమే. నాదగ్గర లేని ఆధారాలు శేఖర్ బాషా తీసుకొచ్చాడు అని పేర్కొన్నారు. పోలీసులు నాకు నోటీసులు ఇచ్చారు, నేను పోలీసులకు ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చాను అని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.