Tollywood Producer: తెలుగులో పలు సినిమాలు నిర్మించి వివాదాస్పద నిర్మాతగా పేరు తెచ్చుకున్న బషీద్ అనే నిర్మాత అనూహ్యంగా ఒక బ్యాంకు ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. బషీద్ తెర వెనుక నుంచి వేసిన స్కెచ్ కి ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు పావులుగా మారారు. బషీద్ స్కెచ్ నమ్మి సొంత సంస్థకు 40 కోట్ల రూపాయల మేర కన్నం వేసినట్లు పోలీసులు తేల్చారు తెలంగాణలోని శంషాబాద్ తాలూకా ఇండస్ ఇండ్ బ్యాంకులో 40 కోట్ల రూపాయల డబ్బు దొడ్డిదారిలో బదిలీ చేసుకున్న కేసును సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులు ఛేదించారు. ఆ తర్వాత బషీద్ ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా గుర్తించారు. బషీద్ సూచనల మేరకు బ్యాంకు మేనేజర్ మరో ఉద్యోగితో కలిసి ఇన్ 40 కోట్ల రూపాయలు కొట్టేసినట్లు తేల్చడంతో ముగ్గురిని కలిపి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read: Manchu Vishnu: మంచు విష్ణు తప్పు ఒప్పుకో… అన్ని ప్రూఫులు ఉన్నాయి.. యూట్యూబర్ షాకింగ్ వీడియో
ఈ వచ్చిన డబ్బుతో బషీద్ రెండు కార్లు కొన్నాడని తన మోసానికి సహకరించిన మేనేజర్ రామస్వామికి ఒక కారు బహుమతిగా ఇచ్చాడని దర్యాప్తులో తేల్చారు పోలీసులు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూత్రధారి బషీద్ ని ఈ కేసులో ఏ3గా నమోదు చేసి ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకొచ్చారు. బషీద్ అనేక తెలుగు సినిమాలలో నిర్మించడమే కాదు వాటిలో నటించాడు కూడా. ముఖ్యంగా కొన్నాళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ప్రాజెక్టు జడ్ సినిమా నిర్మాత ఇతనే సందీప్ కిషన్ మీద అనేక సంచలన ఆరోపణలు కూడా చేశాడు. ఇక మొత్తంగా అతని మీద పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పది చీటింగ్ కేసులు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాజంపేట లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి దారుణ పరాజయం పాలయ్యాడు.