ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ కొత్త చిత్రం “దుర్గ” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాఘవ లారెన్స్ చాలా విభిన్నమైన గెటప్ లో సన్యాసి లాగా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఇంతకుముందు రాఘవ లారెన్స్ చేసిన హారర్ మూవీస్ కన్నా ఇంకా విభిన్నంగా ఉండబోతుందని పోస్టర్ తో స్పష్టం చేశారు. ఈ హారర్ థ్రిల్లర్ లో లారెన్స్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
Read Also : వీడియో : “మాస్ట్రో” మెలోడీ సాంగ్ రిలీజ్
అయితే దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు సెకండ్ లుక్ ను కూడా విడుదల చేశారు. సెకండ్ లుక్ లో రాఘవ లారెన్స్ మామూలుగానే కనిపించాడు. కానీ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై భారీగా బజ్ పెంచేశారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రుద్రాన్” , “అధికారం” చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.