వీడియో : “మాస్ట్రో” మెలోడీ సాంగ్ రిలీజ్

నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “మాస్ట్రో”. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి “వెన్నెల్లో ఆడపిల్ల” పాటను ఆవిష్కరించారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ పాట అందమైన మెలోడియస్ సాంగ్. సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. యువ సంగీత స్వరకర్త, గాయకుడు స్వీకర్ అగస్తి “వెన్నెల్లో ఆడపిల్ల” సాంగ్ పాడారు. ఈ పాటకు శ్రీజో, కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు.

Read Also : విడుదలకు ముందే లాభాల్లో “టక్ జగదీష్”

నితిన్ సాంగ్ ప్రదర్శన ఇవ్వడం చూసి నభా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాట ప్రారంభమవుతుంది. అది గోవాలో నితిన్, నభా అద్భుతమైన ప్రేమ కథను ప్రదర్శించే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లకు తీసుకెళ్తుంది. “మాస్ట్రో” డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్ ఓటిటి విడుదలకు సిద్ధంగా ఉంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. సోదరి నిఖిత రెడ్డి దీనిని నిర్మించారు.

-Advertisement-వీడియో : "మాస్ట్రో" మెలోడీ సాంగ్ రిలీజ్

Related Articles

Latest Articles