Radhika Apte : బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే తరచూ ఏదో ఒక విషయంపై ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా హిట్లు పడలేదు. దీంతో లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో హీరోయిన్లపై ఉన్న వివక్షను తెలిపింది. చాలా సార్లు హీరోలను బేస్ చేసుకునే కథలు రాసుకుంటున్నారు. అసలు హీరోయిన్లకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు అంటూ తెలిపింది ఈ బ్యూటీ.
Read Also : Swara Bhaskar : శృంగారం సీన్లు చేస్తే తప్పేంటి.. హీరోయిన్ బోల్డ్ కామెంట్
కేవలం హీరోల కోసమే సినిమాలు చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా మొత్తం హీరోనే ఉంటాడు. అసలు హీరోయిన్లకు పెద్దగా స్కోప్ ఏమీ ఉండదు. హీరోల కోసమే సీన్లు డిజైన్ చేస్తుంటారు. హీరోయిన్ అంటే కేవలం హీరో వెనకాల కాపాడమని నిలబడాలి. అంతే తప్ప మేం దేనికీ పనికిరాం. హీరోయిన్లు గ్లామర్ చూపించడానికే పనికొస్తారు తప్ప అంతకు మించి ఇంకేం ఇంపార్టెన్స్ మాకు ఉండదు అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Bunny Vasu : బుక్ మై షో రేటింగ్స్ ఇవ్వడం మానేయాలి.. బన్నీ వాసు సూచన