Swara Bhaskar : హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇలాంటి సీన్లు చేస్తే కాస్త వేరుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఏ సినిమా అయినా ఇలాంటి బోల్డ్ సీన్లు కామన్ అయిపోయాయి. పైగా ఈ సీన్లు అవసరం లేకపోయినా పెట్టేస్తున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ ఇలాంటి సీన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లో నేను కూడా చాలా సార్లు బోల్డ్ సీన్లలో నటించాను. కాకపోతే అది సినిమాలో ఒక భాగంగానే చూడాలి అని తెలిపింది ఈ బ్యూటీ.
Read Also : Bunny Vasu : బుక్ మై షో రేటింగ్స్ ఇవ్వడం మానేయాలి.. బన్నీ వాసు సూచన
నాకు తెలిసినంత వరకు అందరికీ శృంగారంపై అవగాహన పెంచుకోవాలి. సినిమాల్లో బోల్డ్ సీన్లు చేస్తే తప్పుగా చూడొద్దు. దాన్ని ఒక జీవిన విధానంగా మాత్రమే చూడాలి. మన జీవితంలో ఇలాంటివి కామన్ అనే విధంగా అందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాలి. అప్పుడే ఇలాంటివి సినిమాల్లో చూసినా సరే మన మెదడు చెడుగా ఆలోచించదు. దాన్ని కామన్ గానే చూస్తుంది అంటూ తెలిపింది స్వరా భాస్కర్. ఆమె గతంలో ది వెడ్డింగ్ సినిమాలో ఏకంగా హస్తప్రయోగం చేసుకునే సీన్ లో నటించడం అప్పట్లో సంచలనం రేపింది.
Read Also : Mithramandali : అలాంటి వాళ్లంతా పిచ్చోళ్లే.. బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్