యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. పీరియాడికల్ లవ్ స్టోరీగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించి రెండు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అప్డేట్స్ కావాలని అభ్యర్థించారు. అయినప్పటికీ రెస్పాన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా “రాధేశ్యామ్” అప్డేట్ కావాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత ఎప్పటికో ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ తరువాత అభిమానులు సంతృప్తి పడలేదని తెలిసి చిన్న వీడియోను రిలీజ్ చేశారు. మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నారు.
Read Also : విజయ్ సేతుపతి సరికొత్త రికార్డు… సౌత్ లోనే మొదటిసారి !
ఇలా కొంత గ్యాప్ తీసుకుంటూ సినిమా నుంచి ఇప్పటి వరకూ 10 పోస్టర్లు మాత్రమే విడుదల చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల అసహనం హద్దులు దాటింది. ఈరోజు కూడా కృష్ణాష్టమి సందర్భంగా కేవలం ఒక పోస్టర్ ను విడుదల చేయడంతో నెట్టింట్లో ఇప్పటికి 10 పోస్టర్లు వచ్చాయి. కానీ టీజర్ లేదు, ట్రైలర్ లేదు అంటూ సెటైర్లు వేశారు. దీంతో సినిమా నిర్మాణ సంస్థ వారి మొర ఆలకించారో ఏమో కానీ సెప్టెంబర్ 10న “రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల మొరను “రాధేశ్యామ్” మేకర్స్ ఆలకించారన్న మాట.
అయితే సినిమా విడుదల కావడానికి ఇంకా దాదాపు 4 నెలలు ఉంది. మరి అప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారా ? లేదంటే కేవలం సాంగ్ మాత్రమే రిలీజ్ చేసి అభిమానుల సహనానికి మేకర్స్ పరీక్ష పెడతారో చూడాలి. అయితే ఈ సాంగ్ రిలీజ్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.