Pushpa2TheRule : సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఇందులో డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా హారీ క్రేజ్ సంపాదించుకున్నాయి. శ్రీలీల స్టెప్పులేసిన కిస్సింగ్ సాంగ్ దుమ్ములేపింది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీలీల, అల్లు అర్జున్ ఎంత కష్టపడి స్టెప్పులేశారో ఇందులో చూపించారు. ముఖ్యంగా శ్రీలీల ఈ పాట కోసం చేసిన రిహార్సల్స్ ఇందులో చూపించారు. అందంతో పాటు డ్యాన్స్ తో ఇందులో ఆమె ఇరగదీసింది.
Read Also : Vijayawada Crime: ప్రియురాలి హత్యకు న్యాయవాది ప్రయత్నం.. కారుతో ఢీకొట్టి..
ఈ పాటపై అప్పట్లో మంచి బజ్ ఏర్పడింది. కానీ ఈ పాట వచ్చిన మొదట్లో మొదటి పార్టులోని ఊ అంటావా మావ సాంగ్ లో సమంతతో శ్రీలీలను పోల్చి ట్రోల్స్ చేశారు. సమంత ముందు శ్రీలీల తేలిపోయిందంటూ పోస్టులు కూడా పెట్టారు. కానీ ఏదేమైనా శ్రీలీల తన అందం, డ్యాన్స్ తో కుర్రకారును ఊపేసింది. ఈ మేకింగ్ వీడియో విడుదలైన కొద్ది క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఈ సాంగ్ తర్వాత మళ్లీ ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాల్సిన మూవీకి కొంచెం సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుసగా డైరెక్టర్లను లైన్ లో పెడుతున్నాడు.