పుష్ప: ద రైజ్ విడుదలైన కొన్ని రోజులకే పుష్ప: ద రూల్ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని సుకుమార్ సహా నిర్మాతలు స్పష్టం చేశారు. కానీ.. ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. కారణం.. స్క్రిప్టులో మార్పులు చేయడమే! పాన్ ఇండియా లెవెల్‌లో పుష్ప ఘనవిజయం సాధించడంతో.. సుకుమార్ స్క్రిప్టుపై మరోసారి కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. కొత్త కొత్త పాత్రల్ని డిజైన్ చేస్తూ.. వాటి కోసం క్రేజీ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నాడు. మొదటి భాగానికి పూర్తి న్యాయం చేసేలా సరైన మెరుగులు దిద్దేందుకు సమయం పడుతోందని తెలిసింది. దీంతో, ఈ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లుంది? అనే ప్రశ్న మిస్టరీగానే ఉండిపోయింది.
ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ మిస్టరీ వీడింది. పుష్ప: ద రూల్ సినిమా షూటింగ్ ఎప్పట్నుంచి ప్రారంభం కానుందన్న విషయంపై ఓ క్లారిటీ బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో ఇది పట్టాలెక్కనుందట! అప్పటి నుంచి గ్యాప్ ఇవ్వకుండా.. ఏకధాటిగా చిత్రీకరణ కొనసాగించేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈసారి నటీనటుల సంఖ్య మరింత పెరిగింది కాబట్టి.. వాళ్ల డేట్స్‌ని దృష్టిలో పెట్టుకొని, షూటింగ్‌లో జాప్యం అవ్వకుండా పం పక్కా స్కెచ్ వేసినట్టు తెలిసింది. ప్రస్తుతం లొకేషన్స్‌ని సెర్చ్ చేసే పనుల్లో ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించి, వచ్చే ఏడాది సమ్మర్‌కి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.