టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల కెరీర్ ను మలుపు తిప్పిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. స్టార్ కిడ్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అంటే అది పూరికి మాత్రమే సాధ్యం. రామ్ చరణ్‌ని ఇంటడ్యూస్ చేసింది కూడా దర్శకుడు పూరినే అలాంటిది ప్రజంట్ ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. తెలుగు హీరోలు కనీసం పట్టించుకోవడం లేదు. చివరగ లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పూరి తిరిగి ఇప్పుడు కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. అది కూడా తమిళ హీరో విజయ్ సేతుపతితో.
Also Read: Akhil : మాస్ టైటిల్ సాంగ్ ప్లాన్ చేస్తున్న అఖిల్
ఈ మూవీ గురించి అనౌన్స్ మెంట్ వచ్చకా తమిళ ప్రేక్షకులు విజయ్ అభిమానులు కోంత నిరుత్సాహం కనబరిచారు ఎందుకంటే. డిజాస్టర్ లో ఉన్న దర్శకుడితో మూవీ ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ పూరి టాలెంట్ ఏంటో తెలుసుకొని మాట్లాడండి అంటూ టాలీవుడ్ ప్రేక్షకులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఏంటీ అంటే ఈ మూవీలో ఓ సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు సీనియర్ బ్యూటీ టబు. ఈ చిత్రంలో ఓ కీలక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.