పూరి జగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు.. ఆటోమేటిక్‌గా జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. కొన్నాళ్లు వరుస ఫెయిల్యూర్స్ చూసిన పూరి.. ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా కోసం పూరి చాలా సమయం తీసుకున్నాడు.. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. లైగర్ పై భారీ అంచనాలున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. ఆగష్టు 25న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఇప్పుడు సర్ప్రైజ్ అంటూ.. ఓ బిగ్ అప్టేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
విజయ్ దేవరకొండ బర్త్‌డే సంర్భంగా.. ‘వార్నింగ్.. he is రెడీ టు స్టార్ట్ హంటింగ్’ అంటూ.. మే 9న సాయంత్రం 4 గంటలకు ఓ సాలిడ్ అప్డేట్ రానుందని చెప్పారు. హీరో కూడా తాను ఆకలితో ఉన్నానని, ఇండియా కూడా ఆకలిగా ఉందని, ఇక ఇప్పుడు వేటాడే టైమ్ వచ్చిందని పేర్కొన్నారు. దాంతో రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నప్పటికీ.. కాస్త ఫైర్ అవుతున్నారు. లైగర్ వేట మొదలు పెట్టబోతున్నాడు సరే.. కానీ సినిమాలో పాటా.. పోస్టరా.. లేక ట్రైలరా.. ఏది రిలీజ్ చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో అసలు ఆ రోజు ఎలాంటి అప్టేట్ ఇవ్వబోతున్నారని.. అభిమానులు ఫైర్ అవుతున్నారు. పైగా హీరో ఫోస్టర్ కాకుండా.. సింహం పోస్టర్‌తో ఈ అప్డేట్ ఇవ్వడంతో.. మరింత మండిపడుతున్నారు రౌడీ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో రేపో మాపో లైగర్ నుంచి ఎలాంటి అప్టేట్ రాబోతుందో క్లారిటీ ఇచ్చే అవకాశముంది అంటున్నారు. ఇక బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా లైగర్ నుంచి రాబోయే బిగ్ అప్టేట్ ఏంటో చూడాలి.