కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం “James” గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సూపర్ హిట్ యాక్షన్ మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులను చేజిక్కించుకున్న Sony LIV తన ఓటిటి ప్లాట్‌ఫామ్ లో ఏప్రిల్ 14న “జేమ్స్” మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓటిటిలో ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో భాషల్లో అందుబాటులోకి రానుంది.
Read Also : Will Smith : ఆస్కార్ ఉత్తమ నటుడు విల్ స్మిత్ కు ఏం జరగనుంది?
మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “జేమ్స్” మూవీకి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్ ముఖర్జీ, ముఖేష్ రిషి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని పునీత్ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ నిర్మించారు. చరణ్ రాజ్ సంగీతం అందించిన యాక్షన్ డ్రామా “జేమ్స్” మూవీని ఓటిటిలోనూ చూసి ఆనందించడానికి పునీత్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక దివంగత నటుడు, కన్నడ సూపర్ స్టార్ నటించిన చివరి చిత్రం కావడంతో “జేమ్స్”కు ఓటిటిలో మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.