Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ కె.. టైటిల్ ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ నెట్టింట లీక్ అయ్యింది. మొదట ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడిన విషయం విదితమే. అందుతున్న సమాచారం ప్రకారం మే 9 న ప్రాజెక్ట్ కె రిలీజ్ కానుందని తెలుస్తోంది.
JD Chakravarthy: ఆ హీరోయిన్ కోసం నేను, కృష్ణవంశీ కొట్టుకున్నాం..అర్ధరాత్రి అరకు నుంచి
ఆ డేట్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు, వైజయంతి మూవీస్ బ్యానర్ కు ఎంతో ముఖ్యమైన రోజు. ఎందుకంటే.. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు- అతిలోక సుందరి రిలీజ్ అయ్యిన రోజు.. ఇక డే రోజు నాగ్ అశ్విన్ ను స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టిన మహానటి సినిమా రిలీజ్ అయిన రోజు. ఈ రెండు సెంటిమెంట్స్ వలన మే 9 న ప్రాజెక్ట్ కె ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు.. హిట్ డేట్ అంటే.. సినిమా కూడా హిట్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్,దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.