Baahubali Epic : పదేళ్ల క్రితం సినిమా ప్రపంచంలో సునామీ సృష్టించింది బాహుబలి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దాని తుఫాన్ కనిపిస్తోంది. బాహుబలి రెండు పార్టులు కలిపి ఒకే పార్టుగా బాహుబలి ఎపిక్ పేరుతో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అనేక రూమర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ ను కాకుండా హృతిక్ రోషన్ ను అనుకున్నారని.. రాజమౌళి అతనికి కథ కూడా చెప్పాడంటూ అప్పట్లో ప్రచారం జరిగాయి. ఇప్పుడు మరోసారి అవే రూమర్లు వినిపిస్తున్నాయి.
Read Also : Baahubali Epic : బాహుబలి ఎపిక్ రన్ టైమ్ ఎంతో తెలుసా.. ఇక్కడే సర్ ప్రైజ్
దీంతో వీటిపై తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ఆ రూమర్లు అన్నీ ఉత్తవే అని కొట్టిపారేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. తాము అసలు హృతిక్ ను అనుకోలేదని.. మొదటి నుంచి ప్రభాస్ ను మాత్రమే తమ హీరోగా అనుకున్నట్టు తెలిపారు. బాహుబలి ఎపిక్ సినిమాలో చాలా సీన్లు తీసేయాల్సి వచ్చిందన్నారు. కొన్ని సర్ ప్రైజ్ లు కూడా పెట్టినట్టు వివరించారు. ఫ్యాన్స్ కు ఈ సినిమా సరికొత్త బూస్ట్ ఇస్తుందన్నారు శోభు యార్లగడ్డ.
Read Also : Mask Man Harish : మీరు బండ ఆంటీనా.. రిపోర్టర్ పై మాస్క్ మ్యాన్ ఫైర్