Mask Man Harish : బిగ్ బాస్ హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌస్ లో ఉన్నంత సేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ.. అందరిపై నోరు పారేసుకున్నాడు. చూసే వాళ్లకు కూడా చిరాకు తెప్పించింది అతని ప్రవర్తన. అందుకే అతన్ని హౌస్ నుంచి ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేశారు. అయితే తాజాగా అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అయితే ఇందులో ఓ లేడీ రిపోర్టర్ మాట్లాడుతూ.. మీరు హౌస్ ఉన్నప్పుడు నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశాను. మిమ్మల్ని గుండు అంకుల్ అంటే నిజంగానే ఫీల్ అయ్యారా.. మీకు బట్టతల లేదు కదా. మీకు హెయిర్ ఉంది. అలాంటప్పుడు మీరు ఫీల్ కావాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించింది.
Read Also : Baahubali Epic : బాహుబలి-3పై నిర్మాత క్లారిటీ.. సర్ ప్రైజ్..
దానికి మాస్క్ మ్యాన్ హరీష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ‘హో.. మీరు బండ ఆంటీ కదా.. మీరు కొంచెం బండగా ఉన్నారు కదా.. మిమ్మల్ని బండ ఆంటీ అని పిలవొచ్చా అని హరీష్ అనడంతో అంతా షాక్ అయ్యారు. ఒక రిపోర్టర్ ను మీరు అలా అనడం కరెక్ట్ కాదు అని అక్కడున్న వారు అనడంతో.. ‘లేదు లేదు.. మీరు ఇక్కడ రిపోర్టర్ అనే విషయం తీసుకురావొద్దు. నేను సెలబ్రిటీని అనాల్సి వస్తుంది. ఇక్కడ మనం అందరం ముందు మనుషులం. అందరికీ మనోభావాలు ఉంటాయి. మీరు ఫీల్ అయితే నేను ఫీల్ అవను. మీరు ఫీల్ అయితే నేను కూడా ఫీల్ అవుతా అంటూ చెప్పుకొచ్చాడు హరీష్.
Read Also : Rashmika – Rukmini : రష్మికకు చెక్ పెడుతున్న సెన్సేషనల్ హీరోయిన్..