Baahubali Epic : బాహుబలి రెండు పార్టులను కలిపి బాహుబలి ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా తీసుకువస్తున్న విషయం తెలిసిందే. సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మూవీని అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ఎపిక్ సినిమాపై చాలా రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. సినిమా రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలని తెలిపారు. అయితే దీనిపై చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు అన్నారు. ఇందులో మొదటి పార్టు ఇంటర్వెల్ దాకా ఉంటుందన్నారు.
Read Also : Mask Man Harish : మీరు బండ ఆంటీనా.. రిపోర్టర్ పై మాస్క్ మ్యాన్ ఫైర్
రెండో పార్టు ఇంటర్వెల్ నుంచి చివరిదాకా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇందులో కొన్ని సర్ ప్రైజ్ సీన్లు కూడా ఉంటాయిన హైప్ ఇచ్చారు. గతంలో దాణవీరశూర కర్ణ సినిమా తర్వాత ఆ స్థాయిలో రన్ టైమ్ ఉన్న సినిమాల లిస్టులో ఇది చేరుతుందన్నారు. అయితే అంతసేపు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టడంపై తమకు అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు అన్ని రకాల పనులు స్టార్ట్ చేసినట్టు వివరించారు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామన్నారు శోభు.
Read Also : Baahubali Epic : బాహుబలి-3పై నిర్మాత క్లారిటీ.. సర్ ప్రైజ్..