యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోలతో మీడియమ్ బడ్జట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తనకి అనిపించింది చాలా ఓపెన్ గా చెప్పే నాగవంశీ… తన సినిమాల అప్డేట్స్ ఇచ్చే విషయంలో, తన సినిమాలని ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చే విషయంలో చాలా క్లియర్ గా మాట్లాడుతాడు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది. మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ “దిల్ రాజు బలగం సినిమా చేసారు, మీరు మీ సిస్టర్ తో బ్యానర్ పెట్టించి అలాంటి సినిమాలు చేస్తారా?” అని అడిగాడు. మ్యాడ్ సినిమా ఫంక్షన్ లో ఆ సినిమా గురించి కాకుండా ఏవేవో అడిగిన రిపోర్టర్ కి నాగవంశీ స్ట్రాంగ్ కౌంటర్ వేసాడు. దిల్ రాజు బలగం సినిమా చేస్తే నేను అలాంటిదే చేయాలని లేదు కదా. సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎవరూ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా రారు. మా తర్వాత మా చెల్లినే ఉంది కాబట్టి తను కూడా ఇష్టంతో ఇటు వైపు వచ్చింది అంతే” అంటూ నాగ వంశీ ఆన్సర్ చేసాడు.
మ్యాడ్ మూవీ ప్రమోషనల్ ప్రెస్ మీట్ లోనే గుంటూరు కారం సినిమా గురించి కూడా మాట్లాడిన నాగ వంశీ, “రాజమౌళి సినిమా కలెక్షన్ల రేంజులో గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయి, సినిమా చూసాక ఆడియన్స్ కూడా ఇదే మాట అంటారు” అని చెప్పాడు. రాజమౌళి సినిమా రేంజ్ కలెక్షన్స్ రావాలి అంటే అది పాన్ ఇండియా సినిమా అవ్వాలి, రాజమౌళి రేంజులో ప్రమోషన్స్ చేయాలి… ఇవి రెండూ లేకుండా రాజమౌళి సినిమా రేంజులో కలెక్షన్స్ తీసుకొని వస్తుందని నాగ వంశీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే ఈ సంక్రాంతికి మహేష్ బాబు బాక్సాఫీస్ ని బొమ్మ చూపించడం గ్యారెంటీ. అసలు ఇంతకీ త్రివిక్రమ్ ఆ రేంజ్ సినిమా ఎలాంటి కథతో చేస్తున్నాడు అనేది చూడాలి.
ఇండస్ట్రీలోకి ఎవడైనా ఇష్టంతోనే వస్తాడు..సురేష్ కొండేటి పై సీరియస్ అయిన నాగవంశీ..!!#SureshKondeti #NagaVamsi #MAD #SitaraEntertainments #NTVENT #NTVTelugu pic.twitter.com/SKWBdvLXa4
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) September 27, 2023