Priyanka Mohan: న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఈ ఏడాది దసరా సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. హయ్ నాన్నతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. తనకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. అంటే సుందరానికి అనే సినిమాతో క్రేజీ కాంబో అనిపించుకున్నారు వివేక్ ఆత్రేయ, నాని. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇక ఈ సినిమా తరువాత వివేక్.. నాని కోసమే మరో కథను రెడీ చేశాడు. అదే నాని 31. డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నాని కెరీర్లో 31వ చిత్రంగా రాబోతుంది. #Nani31 ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ అనౌన్సమెంట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని కొత్త సరికొత్త లుక్‌లోకి రాబోతున్నట్టుగా చూపించారు. అక్టోబర్ 24న ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు.
PM Modi: ‘గగన్‌యాన్’కి మరింత చేరువయ్యాం.. ఇస్రో ప్రయోగంపై ప్రధాని మోడీ..
ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపిక అయ్యినట్లు మేకర్స్ తెలిపారు. ఈ కాంబో కూడా అందరికి తెల్సిందే. అమ్మడిని తెలుగుతెరకు పరిచయం చేసిందే నాని. గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది కానీ, ప్రియాంకను మాత్రం తెలుగు ఇంటి ఆడపడుచును చేసేసింది. ఇప్పుడు రెండో సారి ప్రియాంక, నాని సరసన ఆడిపాడనుంది. సాధారణంగా నాని, హీరోయిన్లను రిపీట్ చేయడు.. చాలా రేర్ కాంబోస్.. అంటే నిత్యా మీనన్, నివేథా థామస్, కీర్తి సురేష్ లా .. ఇప్పుడు ప్రియాంక ఆ లిస్ట్ లో చేరింది. మరి ఈ కాంబో రిపీట్ క్రేజీగానే ఉన్నా .. రిజల్ట్ మాత్రం రిపీట్ అవ్వకుండా ఉంటే చాలని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి నాని.. ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
Welcome aboard, @priyankaamohan! ❤️
Can't wait to see you on the set soon! 🤗#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/BYly81zZ3g
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023