Akkineni Nagarjuna: నా సామి రంగా సినిమాతో మంచి సంక్రాంతి హిట్ అందుకున్నాడు అక్కినేని నాగార్జున. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాడు. అందుకున్నాడు. ఇకపోతే ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు ధీటుగా సీనియర్ హీరోలు.. చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి మూడు సినిమాలు చేస్తున్నాడు.. బాలయ్య రెండు.. వెంకీ మామ రెండు.. నాగర్జున సంగతి కొస్తే ఒకపక్క హీరోగానే కాకుండా ఇంకోపక్క కీలకపాత్రలో కూడా కనిపిస్తూ సంపూర్ణ నటుడుగా మారుతున్నాడు. ఇప్పటికే ధనుష్- శేఖర్ కమ్ముల చిత్రంలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కాకుండా నాగ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడుతో నాగ్ ఒక సినిమా చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. అయితే అది అధికారకమని సమాచారం అందుతుంది.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం సీనియర్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నాడట నాగ్. ఒకప్పుడు కుర్ర హీరోయిన్లను ప్రిఫర్ చేసిన సినియర్ హీరోలు.. ఇప్పుడు సీనియర్ హీరోయిన్లపైనే మనసు పారేసుకుంటున్నారు. ఇక ఈ మధ్యనే చిరు నటిస్తున్న విశ్వంభరలో త్రిషను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. నాగ్ కూడా ఇప్పుడు చిరుని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సీనియర్ బ్యూటీ ప్రియమణిని సంప్రదించినట్లు సమాచారం. 14 ఏళ్ళ క్రితం రగడ సినిమాలో వీరు జంటగా కనిపించారు. ఇన్నాళ్ల తరువాత ప్రియమణి, నాగ్ సరసన రొమాన్స్ చేయనుంది. ఇకపోతే ఈ సినిమా సీరియస్ కోర్టు డ్రామాగా నడుస్తుందని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.