Towhid Hridoy: బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం!
- బంగ్లాదేశ్ ఆటగాడు తౌహిద్ హృదోయ్‌పై నిషేధం
- డీపీఎల్ 2025లో అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించిన తౌహిద్
- అబాహానీ లిమిటెడ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ఆటగాడు తౌహిద్ హృదోయ్‌పై నిషేధం పడింది. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించినందుకు తౌహిద్‌పై నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ పడింది. అంతేకాదు అతడి ఖాతాలో 8 డీమెరిట్ పాయింట్లను చేర్చారు. డీపీఎల్ 2025లో అబాహానీ లిమిటెడ్‌తో జరిగే కీలక మ్యాచ్‌తో పాటు వచ్చే సీజన్‌లో జరిగే తొలి మూడు మ్యాచ్‌లకు తౌహిద్ దూరం కానున్నాడు. డీపీఎల్ 2025లో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Also Read: Kishan Reddy: దక్షిణాదిలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తాం!
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
తౌహిద్ హృదోయ్ తాజాగా గాజీ గ్రూప్ క్రికెటర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 54 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఔటైన తర్వాత అంపైర్ నిర్ణయంపై తౌహిద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానం వైపు చూపిస్తూ.. తలను అడ్డంగా ఊపాడు. ఇది డీపీఎల్ ప్రవర్తనా నియమావళి లెవల్ 1 నేరంగా పరిగణించారు. Tk 10,000 (7,026 రూపాయలు) జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. అంతకుముందు అతడి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్స్ ఉండడంతో.. నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో తౌహిద్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!