Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొంది. వాటర్ మాఫియాను ప్రధానాంశంగా తీసుకొని దానికి కామెడీ జోడించి మిత్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక రెండు విభిన్నమైన పాత్రలో కార్తీ నట విశ్వరూపం చూపించాడు.
ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. ఇంకా ఈ చిత్రం ఓటిటీ కు కూడా రాలేదు అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించేశాడు కార్తీ. సర్దార్ 2 ను అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు పోలీస్ గా ఉన్న కార్తీ సెకండ్ పార్ట్ లో తండ్రిలా స్పై గా మారనున్నాడు. కాంబోడియా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు హింట్ ఇచ్చారు. మరి ఈసారి మిత్రన్ ఏ మాఫియాను రంగంలోకి దింపుతాడో చూడాలి.