కింగ్ నాగార్జున నెక్స్ట్ మూవీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. మోనోక్రోమ్ ప్రీ-లుక్ పోస్టర్ లో హీరో కనిపిస్తున్నాడు. నాగార్జున రక్తంలో తడిసిన కత్తిని పట్టుకుని వర్షంలో నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ డిజైన్ చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుందా ? అనే డౌట్ వస్తోదని. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో నాగ్ ను చూపించబోతున్నారు. చిత్రం నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29 న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
Read Also : రేప్ కేసుపై హైకోర్టు తీర్పు… తాప్సి షాకింగ్ రియాక్షన్
నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, యువ మలయాళ బ్యూటీ అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.