Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే.. ఈ సంక్రాంతి సినిమాల్లో అందరి చూపు హనుమాన్ మీదనే ఉంది. అయితే థియేటర్స్ విషయంలో జరుగుతున్న చర్చలు వలన ఈ సినిమా మరింత హైప్ తెచ్చుకుంది. ఎవరు ఎన్ని రకాలుగా సినిమాను వాయిదా వేయడానికి ట్రై చేసినా కూడా తాము వెనక్కి తగ్గేది లేదని గట్టిగా నిలబడి సంక్రాంతి రేసులో నిలబడ్డారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తుంది.
ఇక తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ప్రశాంత్ వర్మ మహాభారతం కనుక డైరెక్ట్ చేస్తే.. కర్ణుడు పాత్రకు ఎవరిని తీసుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ .. కర్ణుడు పాత్రకు పవన్ కళ్యాణ్ సరిపోతాడని చెప్పాడు. ఎందుకు అని అడగ్గా.. ” ఆ సిన్సియారిటీ, కర్ణుడు అనగానే అందరికి గుర్తొచ్చేది.. చాలామంది ఇబ్బందులు పెడుతూ ఉంటారు కంటిన్యూస్ గా.. కానీ, కర్ణుడు మాత్రం తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఫైట్ చేస్తూనే ఉంటాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అలా ఉంటారు. అందుకే ఆ పాత్రకు పవన్ కళ్యాణ్ ను అనుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోపై పవన్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ఏం చెప్పావ్ అన్నా.. నెక్స్ట్ లెవెల్ అంతే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి హనుమాన్ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.