ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ శ్రీలీలా, కృతి శెట్టి, రష్మిక, పూజా హెగ్డే లాంటి వాళ్లు మేజర్ గా గ్లామర్ తోనే కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎలా కనిపించాలో పర్ఫెక్ట్ గా తెలిసిన ఈ హీరోయిన్లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్నారు. ఈ విషయం తెలియక ఎంతోమంది హీరోయిన్స్ కి కెరీర్ ని క్లోజ్ చేసుకున్నారు. సరైన సినిమాలు చేయక, గ్లామర్ షోకి లిమిట్స్ పెట్టుకోని, జస్ట్ యాక్టింగ్ స్కిల్స్ ని మాత్రమే నమ్మి సినిమాలు చేస్తూ… ఇలా రకరకాల కారణాలతో కనుమరుగైన హీరోయిన్స్ లో కచ్చితంగా చెప్పుకోవాల్సింది ‘ప్రగ్యా జైస్వాల్’ గురించి. KGF సినిమాలో బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుతున్నారు కదరా అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ ప్రగ్యా జైస్వాల్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కంచె సినిమాతో యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రగ్యా జైస్వాల్, తన అందంతో కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. కెరీర్ లో ఎక్కువ శాతం ట్రెడిషనల్ రోల్స్ చేయడంతో గ్లామర్ రోల్స్ ప్రగ్యా జైస్వాల్ కి రావడం మానేసాయి. ఇదే సమయంలో చేసిన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ప్రగ్యా కెరీర్ ఆశించిన స్థాయిలో జరగలేదు.
హిట్ పర్సెంటేజ్ ఎక్కువ లేకపోవడంతో ప్రగ్యా కెరీర్ దాదాపు క్లోజ్ అయిపొయింది. ఇలాంటి టైంలో నందమూరి బాలకృష్ణ బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది కానీ ప్రగ్యాకి మాత్రం పెద్దగా కలిసి రాలేదు. దీంతో ప్రగ్యా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక చేసేదేమీ లేక తను పెట్టుకున్నా కంచెలు చెరిపేసి, ప్రగ్యా గ్లామర్ డోస్ పెంచి, తనలో ఎంత విషయం ఉందో చూపించడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో అదరకొడుతూ ఫాలోవర్స్ కి కిక్ ఇస్తుంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్, జీన్స్ పాంట్ బటన్స్ విప్పేసి మరీ స్కిన్ షో చేస్తోంది. తన ఫిజిక్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. గతంలో బికినీ కూడా వేసుకున్న ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. మరి పెరిగిన ఈ గ్లామర్ డోస్ ప్రగ్య కెరీర్ కి ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.