రీసెంట్‌గా వచ్చిన ఆచార్య రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. వెండితెరపై తండ్రీ, తనయులను చూసి తెగ మురిసిపోతున్నారు మెగాభిమానులు. ముఖ్యంగా భలే భలే బంజారా సాంగ్‌లో రామ్ చరణ్, చిరంజీవి స్టెప్స్ అదరహో అనేలా ఉన్నాయి. ఈ పాటలో చిరు, చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ మైఖెల్ జాక్సన్ రంగంలోకి దిగారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ మూవీని ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో.. మెగాస్టార్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నగాడ్ ఫాదర్.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అందులోభాగంగా.. చిరంజీవి.. సల్మాన్ ఖాన్ మీద ఒక స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ పాటకు అదిరిపోయే ట్యూన్ ఇచ్చానని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గతంలోనే చెప్పారు. ఇక ఇప్పుడు ఆ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారని.. రంజాన్ సందర్భంగా వెల్లడించారు. ఆటం బాంబు లాంటి పాటకోసం ప్రభుదేవా.. అంటూ తమన్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు. ఇక మెగాస్టార్ అండ్ ప్రభుదేవా కాంబోలో సాంగ్ వచ్చి చాలా కాలం అవుతోంది. దాంతో ఈ సారి ప్రభుదేవా కొరియేగ్రఫీకి.. చిరు, సల్మాన్ స్టెప్పులకు.. తమన్ ట్యూన్‌కు.. థియేటర్లో బాక్సులు బద్దలవడం ఖాయమంటున్నారు. ఇదే కాదు ఈ మూవీలో చిరు, సల్మాన్‌ల మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని అంటున్నారు. దాంతో గాడ్ ఫాదర్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా సిల్వర్ స్క్రీన్ మీద చిరు, సల్మాన్ కలిసి స్టెప్పేస్తే.. అదరిపోతుండనడంలో ఎలాంటి సందేహం లేదు.