రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. టీజర్, ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి యుట్యూబ్ ని కుదిపేసింది సలార్ ప్రమోషనల్ కంటెంట్. ఇప్పటివరకూ ఉన్న అన్ని డిజిటల్ రికార్డులు చెల్లా చెదురు చేసి సలార్ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్ తో డిజిటల్ రికార్డ్స్ ని సెట్ చేసిన ప్రభాస్… ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటి నుంచి సరిగా పది రోజుల్లో మాస్ హిస్టీరియా అనే పదానికి అర్ధం చూడబోతున్నారు ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ సరిగ్గా చెయ్యట్లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్ని ఇండస్ట్రీల యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల కోసం ఇండియా మొత్తం తిరిగి, ఆడియన్స్ కి కలిసి సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇతర హీరోలు సినిమాల కోసం ఇంతగా ప్రమోషన్స్ చేసినా ప్రభాస్ ఫ్లాప్ సినిమా స్థాయి కలెక్షన్స్ ని కూడా కలెక్ట్ చేయలేకపోతున్నారు. కలెక్షన్స్ పక్కన పెడితే ఓపెనింగ్స్ కూడా ప్రభాస్ సినిమాల స్థాయిలో రావట్లేదు. దీన్ని బట్టి చూస్తే ఇది ప్రభాస్ సినిమా అనే పేరు వినిపిస్తే చాలు వంద కోట్ల ఓపెనింగ్ రావడం గ్యారెంటీ.
ఈ విషయాన్ని ఇప్పటికే ప్రూవ్ చేసిన ప్రభాస్, ప్రస్తుతం ఇండియాలో ఉన్న హీరోలందరి కన్నా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అందుకే ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ విషయంలో కంప్లీట్ సైలెంట్ గా ఉన్నట్లున్నారు. పది రోజుల్లో రిలీజ్ ఉన్నా కూడా ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు… అసలు ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ప్రమోషన్స్ చెయ్యకపోయినా సలార్ సినిమా, పైగా హైప్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. గబ్బర్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే డైలాగ్ ఒకటి రాసాడు “కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” ఈ డైలాగ్ ఇప్పుడు ప్రభాస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ప్రమోషన్స్ ని ఐ డోంట్ కేర్ అన్నట్లు ఉన్న ప్రభాస్ ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబడితే చాలు ప్రభాస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే ఫైర్ మోడ్ లో ఉన్నాయి, రీజనల్ బుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి ఓపెన్ కానున్నాయి. ప్రీ బుకింగ్స్ నుంచి సలార్ సినిమా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయనుంది.