పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “ప్రాజెక్ట్ కే”. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం దీపికా హైదరాబాద్ కు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుండగా… తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also : కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కథ చెబుతాడు… బోయపాటిపై బాలయ్య కామెంట్స్
ప్రభాస్ ఈరోజు “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉదయం నుంచే “ప్రాజెక్ట్ కే” చిత్రాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా, ఇందులో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం దాదాపుగా 12 నుంచి 13 నెలల షూటింగ్ ను ప్లాన్ చేశారట మేకర్స్. ప్రభాస్ సైతం మూవీ కోసం బల్క్ డేట్స్ కేటాయించారట.