Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. దానంలో కర్ణుడు.. రూపంలో బాహుబలుడు.. అభిమానుల గుండెల్లో దేవుడు. అలాంటి రాజుకు ఎలాంటి రాణి వస్తుంది అనేది ఎన్నోఏళ్లుగా అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి. మొదటి నుంచి ఆ స్థానాన్ని అనుష్క భర్తీ చేస్తుందని అభిమానులు కళలు కన్నారు. అది కలగానే మిగిలిపోతుందని, అనుష్క స్థానాన్ని ఇప్పుడు కృతి సనన్ భర్తీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉప్పలపాటి ఇంటి కోడలిగా అయ్యే లక్షణాలు ఆమెకు ఉన్నాయా అని అభిమానులు సందేహపడుతున్నారు. కృష్ణంరాజు బతికి ఉన్నప్పుడు నిత్యం ఆయన ప్రభాస్ పెళ్లి గురించే ఆలోచించేవారట. ప్రభాస్ కు తగిన అమ్మాయిని, ఉప్పలపాటి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే అమ్మాయి కోసం వెతుకుతున్నామని ఎన్నోసార్లు చెప్పారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిని కృష్ణంరాజు ఇష్టపడడం లేదని, అందుకే అనుష్కను సైతం వద్దు అన్నారని అప్పట్లో టాక్ కూడా నడిచింది.
ఇంకోపక్క ప్రభాస్ పెద్దమ్మ కూడా ప్రభాస్ కు తమ తరుపు బంధువుల్లోనే ప్రభాస్ కు అమ్మాయిని చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరి వీటన్నింటిని కృతి చేయగలదా..? ఒకవేళ పెళ్లి అయితే ఆమె ఈ బాధ్యతలు తీసుకోగలదా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగు హీరోను పెళ్ళాడి ఘట్టమనేని ఇంటి బాధ్యతను తన భుజాల మీద వేసుకొంది మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్. ఈ జంట లానే ప్రభాస్- కృతి సనన్ ఉంటారా..? అనేది తెలియాలి. అసలు ఇవన్నీ కాదు ఆలు లేదు.. చూలు లేదు.. అల్లుడు పేరు సోమలింగం అన్నట్లు.. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు. ప్రభాస్ చెప్పింది లేదు.. ఎందుకు అప్పుడే పెళ్లి, వంశం అంటారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా.. ప్రభాస్ కు పెళ్లి కావడం ముఖ్యం.. ఎవరిని చేసుకున్నా మాకు ఓకే అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ రూమర్స్ పై డార్లింగ్ ఎప్పుడు నోరు విప్పుతాడో చూడాలి.