ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని సెపరేట్ చేస్తే అవి రాజమౌళి రికార్డ్స్ vs ఇతరుల రికార్డ్స్ గా చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తే ఉండే బాక్సాఫీస్ కలెక్షన్స్ మరే సినిమాకి ఉండవు. అయితే రాజమౌళి లేకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన హీరో ఒకరు ఉన్నారు. ఆ ఆరు అడుగుల బాక్సాఫీస్ పేరు ‘ప్రభాస్’. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ తో ప్రభాస్ చేసిన సినిమా సాహో. బాహుబలి క్రెడిట్ ని కంప్లీట్ గా రాజమౌళి ఖాతాలో వేసిన వాళ్లకి సాహో సమాధానం అనే చెప్పాలి. ఎందుకంటే సాహో పూర్తిగా ప్రభాస్ పైన నడిచిన సినిమా. మొదటి రోజు మోర్నింగ్ షోకే నెగటివ్ రివ్యూస్ తెచ్చుకోని కూడా సాహో సినిమా రాబట్టిన కలెక్షన్స్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం.
నెగటివ్ రివ్యూస్ కూడా సాహో సినిమాని ఆపలేకపోయాయి, ముఖ్యంగా నార్త్ లో సాహో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ప్రభాస్ రాజమౌళి లేకుండా మొదటి రోజు వంద కోట్లు రాబట్టగల హీరో ఇండియాలో ఉన్నాడు అనే విషయాన్ని నిరూపించాడు. షారుఖ్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ హీరోలు మూడున్నర దశాబ్దాలుగా ఉన్నా డే 1 వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టలేకపోయారు. ఈ రేర్ ఫీట్ ని ప్రభాస్ అఛీవ్ చేసిన తర్వాత పఠాన్ తో షారుఖ్ ఖాన్, జైలర్ తో రజినీకాంత్ కూడా డే 1 వంద కోట్లని రాబట్టారు. ఫ్లాప్ టాక్ కే ర్యాంపేజ్ సృష్టించిన ప్రభాస్, పొరపాటున సాహోతో హిట్ టాక్ కొట్టి ఉంటే ఇండియాస్ మోస్ట్ గ్రాస్డ్ సినిమాల్లో ఒకటిగా సాహో ఉండేది. ఈరోజుతో సాహో సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అయ్యింది, ఈ సంధర్భంగా ఫ్యాన్స్ #4YearsForCriticProofSAAHO అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.