తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత మళ్లీ మీడియా ముందుకి రాలేదు ప్రభాస్. జూన్ 6న ఈ ఈవెంట్ జరిగింది, అప్పటి నుంచి ప్రభాస్ మిస్ అయ్యాడు. జూన్ 16న ఆదిపురుష్ సినిమా రిలీజ్ ఉన్నా ప్రమోషన్స్ లో మాత్రం ప్రభాస్ కనిపించలేదు. ఆదిపురుష్ రిలీజ్ అయ్యి దాదాపు 400 కోట్లు రాబట్టినా కూడా ప్రభాస్ కనిపించట్లేదు. ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కి ముందు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, కనీసం సక్సెస్ మీట్ కూడా చేయలేదు. ప్రస్తుతం థియేటర్లో ఆదిపురుష్ సినిమా బాగానే రన్ అవుతోంది, కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించే సమయంలో ప్రభాస్ ఒక్క పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ ఇస్తే కలెక్షన్స్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో ప్రభాస్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏ సినిమా షూటింగ్ చేస్తున్నాడు? లేదంటే ఎక్కడ చిల్ అవుతున్నాడు? అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే డార్లింగ్ ఇటలీ ఉన్నాడనే న్యూస్ బయటకొచ్చింది. మొన్నటి వరకు నాన్‌స్టాప్ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నాడట. ఇటలీలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడట. ప్రభాస్‌కు ఇటలీ అంటే చాలా ఇష్టం. ఫ్రీ టైం దొరికితే చాలు ఫ్రెండ్స్‌తో కలిసి ఇటలీకి వెళ్తుంటాడు. ఇప్పుడు కూడా ఇటలీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఉండటానికి ప్రభాస్ ఒక విల్లాను రెంట్‌కు తీసుకున్నాడట. ఈ విల్లా కోసం నెలకు 40 లక్షల రెంట్ పే చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే… ప్రభాస్ మరో వంద రోజుల్లో సలార్‌తో బాక్సాపీస్ పై దండయాత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సలార్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. జులై ఫస్ట్ వీక్‌లో సలార్ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. వన్స్ ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ టీజర్ బయటికొస్తే.. సెప్టెంబర్ 28 వరకు సోషల్ మీడియా మోత మోగిపోవాల్సిందే.