ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. జక్కన చెక్కిన ఎపిక్ వార్ డ్రామా బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రీజనల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసాడు ప్రభాస్. ముఖ్యంగా నార్త్ లో ప్రభాస్ సౌత్ నుంచి వెళ్లి వందల కోట్ల మార్కెట్ ని ఓపెన్ చేసిన హీరోగా మారాడు. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సౌత్ హీరోలు నార్త్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు కానీ ప్రభాస్ రేంజ్ మార్కెట్ నార్త్ లో ఏ ఇండియన్ హీరోకి లేదు. హిందీ బెల్ట్ లో ప్రభాస్ ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ చాలా మంది హీరోల హిట్ సినిమా కలెక్షన్స్ అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రభాస్ గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్నాడు, సరైన హిట్ పడక సైలెంట్ గా ఉన్నాడు. ఈసారి బాకీ మొత్తం తీర్చేయడానికి ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్ సీజ్ ఫైర్’ సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రభాస్ ని మళ్లీ బాక్సాఫీస్ బాద్షాగా మార్చనున్నాడు.
సలార్ సినిమా సెన్సార్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. A సర్టిఫికేట్ తో ప్రభాస్ బాక్సాఫీస్ పై దాడి చేయనున్నాడు. రెండు గంటల యాభై అయిదు నిమిషాల నిడివితో ప్రభాస్ దండయాత్ర చేయనున్నాడు. A రేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అవుతుంది అంటే సలార్ సినిమాలో యాక్షన్ భారీగానే ఉంటుంది. బాహుబలి, సాహూ, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకి A రేటెడ్ సర్టిఫికేట్ రాలేదు కానీ బాహుబలికి ముందు ప్రభాస్ చేసిన లాస్ట్ యాక్షన్ మూవీ మిర్చికి మాత్రం A సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్ కి కొత్త అడ్రెస్ ఇచ్చాడు, ఇప్పుడు సలార్ లో కొత్త మాస్ ని ఏకంగా పాన్ ఇండియాకు పరిచయం చేయబోతున్నాడు. 2013లో మిర్చి రిలీజ్ అయ్యింది, 2023లో సలార్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మిర్చి తెలుగు సినిమా… ఇప్పుడు సలార్ ఇండియన్ సినిమా. ఈ పదేళ్లలో ప్రభాస్ గ్రాఫ్ ఎంత పెరిగిందో క్లియర్ గా కనిపిస్తుంది. మరి A రేటెడ్ సినిమాతో ప్రభాస్ పదేళ్ల తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.