Prabhas: ప్రశాంత్‌తో అలా చేయాలనుకున్నా.. 21 ఏళ్ల కెరీర్‌లో ఇలా ఎప్పుడూ భావించలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Interview about Salaar Movie: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెస్టీజియస్ సినిమాలు రూపొందిస్తూ తనదైన స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ మూవీగా రూపొందిన ‘సలార్ సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ప్రభాస్ ‘సలార్ సీజ్ ఫైర్’ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సలార్ సినిమాలో పాత్రల మధ్య చక్కటి ఎమోషన్స్ ఉంటాయని, ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని పాత్రలలో నన్ను చూస్తారని అన్నారు. నేను, ప్రశాంత్ నీల్ కలిసి పని చేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే అందరినీ ఆకట్టుకుంటుందనే విషయాలపై కలిసి బాగా చర్చించాం, అప్పుడు నా మైండ్‌లో ఉన్న ఆలోచనలను ఆయన ముందు పెట్టా, దానికి ఏం చేయాలనే విషయాన్ని ఆయన నాకు వివరించారు. మేం అనుకున్న కథకు బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలనే విషయాన్ని చర్చించాం, అప్పుడు నేను చెప్పిన ఆలోచనల్లో కొన్ని ప్రశాంత్‌కి నచ్చాయి. ఈక్రమంలో ప్రతి సెషన్ ముందు ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం, తను నా పాత్రను ఎలా చూపించాలనుకుంటున్నారనే విషయాలను తను నాకు వివరించేవాడు, ఇద్దరం కలిసి వర్క్ షాప్స్ చేశాం, సరదాగా సినిమాను పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు.
Inaya Sultana: అబ్బా.. ఇంత అందాన్ని చూసి తట్టుకోగలరా.. బాపు బొమ్మే..
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
నేను సినీ జర్నీ ప్రారంభించి 21 ఏళ్లు అవుతున్నాయి, అయితే తనతో ఎప్పుడు షూటింగ్ చేస్తానా అని ఆసక్తిగా ఎదురు చూశాను. షూటింగ్‌కి వెళ్లాలనే ఆలోచనతో కాకుండా ప్రశాంత్‌తో సమయాన్ని గడపాలని అనుకున్నా, నా 21 ఏళ్ల కెరీర్‌లో ఇలా ఎప్పుడూ భావించలేదు. సినిమా షూటింగ్ ప్రారంభమైన నెల రోజుల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం, ప్రశాంత్ హీరోలను గొప్పగా చూపించాలనుకునే దర్శకుడు. సినిమా షూటింగ్ సమయాన్ని తను రిలాక్స్‌డ్‌గా నా సమయానికి తగ్గట్లు చేసుకుంటూ వచ్చాడు. ఇక నాతో పాటు శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ ఇలా అందరూ సెట్స్ లో కలిశామంటే చాలా సరదాగా గడిచిపోయేది. మా ఎంజాయ్‌మెంట్‌కి అడ్డే ఉండేది కాదు. నేను ఎప్పుడూ షాట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడలేదు, ప్రశాంత్ అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మేం వెయిట్ చేస్తామని చెప్పినా అతను వినలేదు, ముందుగానే అన్ని ఏర్పాట్లను చేసుకునేవాడు. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎప్పుడు సెట్స్ లోకి అడుగు పెట్టానో సమయం గుర్తు లేదు, అయితే నేను ఎంటర్ అవగానే అంతా ఆపేసి హీరో సన్నివేశాలు షూట్ చేసేందుకు టీమ్ సిద్ధమైంది, తను అంతలా నన్ను కేరింగ్ గా చూసుకున్నారు.
సలార్ సినిమాలో నా పాత్ర కోసం నేనేం ప్రత్యేకంగా కష్టపడలేదు, క్యారెక్టర్ డిమాండ్ మేరకు కండలు పెంచాలని ప్రశాంత్ ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టు నేను మారాను, అది నాకు సాధారణమైన విషయం మాత్రమే. గత 21 ఏళ్లలో నేను మారిన దానితో పోల్చుకుంటే ఈ సినిమా కోసం జరిగిన మార్పులు చాలా సాధారణమైన విషయమే’’ అని అన్నారు ప్రభాస్.
‘సలార్ సీజ్ ఫైర్’లో రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కటి సోదర భావాన్ని ప్రేక్షకులు చూస్తారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా వ్యవధి 2 గంటల 55 నిమిషాలుగా ఖరారైంది. డిసెంబర్ 22న హోంబలే సంస్థ ఇప్పుడు ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
- Tags
- prabhas
- Prashanth Neel
- salaar
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!