ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ కటౌట్స్ అయిన ప్రభాస్, హృతిక్ రోషన్ లు కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నారు, దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చెయ్యనున్నారు అనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఒక సినిమా ఉంది అని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యడం, ప్రభాస్ తో సినిమా చేయ్యబోతున్నానని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా చెప్పడంతో ప్రభాస్-హృతిక్ రోషన్-సిద్దార్థ్ ఆనంద్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో సినిమా ఫైనల్ అయ్యింది, త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
Read Also: Ram Charan: త్వరలో మగధీరుడు వస్తున్నాడు…
ఇండియాలోనే హైయెస్ట్ బడ్జట్ తో ఈ సినిమాని భారీగా రూపొందించడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీగా ఉన్నారట. ఈ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇటివలే పఠాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సిద్దార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్ తో ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ సినిమాలతో హృతిక్ రోషన్ కి సూపర్ హిట్స్ ఇచ్చిన సిద్దార్థ్ ఆనంద్, ప్రస్తుతం హృతిక్ తోనే ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్-హృతిక్ రోషన్ సినిమాని సిద్దార్థ్ ఆనంద్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని పేరున్న సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడు అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చూడబోతున్నాం అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవచ్చు. టాప్ నాచ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవర్ ది స్కై ఫైట్స్ లో ప్రభాస్-హృతిక్ రోషన్ లు నటిస్తే ఎలా ఉంటుందో ఇండియా చూడాలి అంటే 2025 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
Read Also: Mahesh Vs Prabhas: ‘ఒరేయ్’.. మీ దుంపలు తెగ.. ఫ్యాన్స్ వార్ అని పచ్చిగా తిట్టుకుంటారేంటిరా