గీత ఆర్ట్స్ బ్యానర్ ఇటివలే ‘జల్సా’ సినిమాని 4K క్వాలిటీతో రీరిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్పెషల్ షోస్ కి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అనే రేంజులో జల్సా సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నైజాంలో జల్సా సినిమా రీరిలీజ్ సమయంలో సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. జల్సాతో స్పెషల్ షోస్ ట్రెండ్ లో జాయిన్ అయిన గీత ఆర్ట్స్ ఈసారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా చరణ్ ‘మగధీర’ సినిమా చేశాడు. రామ్ చరణ్ తేజ్ రెండో సినిమాగా బయటకి వచ్చిన ఈ మూవీని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు. అప్పటివరకూ ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులని మగధీర సినిమా బ్రేక్ చేసింది. ఇందులో భైరవగా చరణ్ చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే రెండో సినిమాకి ఈ రేంజులో యాక్టింగ్ చేస్తున్నాడు ఏంట్రా బాబు అని షాక్ అవ్వాల్సిందే. అయితే అప్పట్లో ఈ పాన్ ఇండియా అనే ఆలోచన మేకర్స్ కి లేకపోవడంతో మగధీర సినిమా తెలుగుకి మాత్రమే పరిమితం అయ్యింది. తమిళనాడులో కూడా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అయ్యింది కానీ పెద్దగా సౌండ్ చెయ్యలేదు.
Read Also: OG: అనిరుధ్ అవుట్, తమన్ ఇన్… ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే
ఈసారి మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా మగధీర సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం అవ్వకుండా హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో కూడా రీరిలీజ్ చేస్తే మగధీర సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే అవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ కి, రాజమౌళికి పాన్ ఇండియా మొత్తం క్రేజ్ ఉంది. ఈ సమయంలో మగధీర సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి గీత ఆర్ట్స్ మగధీర సినిమాని మార్చ్ 27న 4K క్వాలిటీతో పాన్ ఇండియా మొత్తం రీరిలీజ్ చేస్తారేమో చూడాలి. అన్నట్లు ఈ సినిమా కలెక్షన్స్ విషయంలోనే రాజమౌళికి, అల్లు అరవింద్ కి విభేదాలు తల్లెత్తాయని… కొన్ని ఏళ్ల పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదని ఆ తర్వాత కూల్ అయ్యి మళ్లీ కలిసారనే రూమర్ ఇండస్ట్రీలో ఉంది.