Mahesh Vs Prabhas: ఒకప్పుడు ఫ్యాన్ వార్ అంటే సినిమా థియేటర్ వద్దనే ఉండేది.. సోషల్ మీడియా వచ్చాకా మూడ్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్ వార్ అని కొట్టుకొని చస్తున్నారు. అసలు ఆ ఫ్యాన్స్ వార్ కు ఒక రీసన్ కూడా ఉండదు. ఎవరో ఒక నెటిజెన్ తమ హీరోను ఒక మాట అన్నాడని ఇంకో హీరో ఫ్యాన్ ఒక మాట అనడం.. దానికి ఇంకో హీరో ఫ్యాన్స్ కౌంటర్ వేయడం.. అలా అలా మొదలై పచ్చి బూతులు తీట్టుకొనేవరకు వెళ్ళిపోతోంది ఈ గొడవ. ముఖ్యంగా స్టార్ హీరోలు వీరి మధ్య నలిగిపోతున్నారు. కోలీవుడ్ లో విజయ్- అజిత్ ల పరిస్థితి మరీ ఘోరం. అజిత్ అభిమానులు విజయ్ చచ్చిపోయాడంటూ పోస్ట్లు పెట్టడం.. దానికి విజయ్ అభిమానులు అజిత్ ను ట్రోల్ చేస్తూ మీమ్స్ వేయడం చూస్తూనే ఉన్నాం. ఇక అంత పెద్ద ట్రోలింగ్ అయితే టాలీవుడ్ హీరోల మీద లేదు కానీ.. మద్యమద్యలో ఇక్కడ కూడా ఫ్యాన్ వార్ అంటూ ఒకరి హీరోను మరొకరు ట్రోల్స్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ కు మధ్య భారీ యుద్ధమే మొదలైంది. ఇక ఈ యుద్ధం మాటల వరకు ఉన్నా బాగుండేది.. కానీ, మాటలను దాటి దాడి చేసుకోవరకు వెళ్ళింది.
ప్రభాస్ అభిమాని, మహేష్ అభిమాని పై కౌంటర్ వేయడం.. అతను నువ్వెక్కడున్నావో చెప్పు వస్తా అని లొకేషన్ షేర్ చేయడం.. అది కాస్తా మిగతా అభిమానులను రెచ్చగొట్టడం ఒరేయ్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ అందులో ఇద్దరి హీరోలతో పాటు వారి కుటుంబాలను కూడా తీసుకొచ్చి పచ్చి బూతులు తిడుతున్నారు.బెంగళూరులో ప్రభాస్ మహేష్ అభిమానుల మధ్య జరిగిన ఈ వార్.. ఇప్పుడు హైదరాబాద్ వరకు వచ్చేసింది. గతరాత్రి నుంచి ఇప్పటివరకు వీరి మధ్య ఒకటే మాటల యుద్ధం. అసలు వీరి మధ్య గొడవకు కారణం ఏంటి..? అనేది ఎవరికి తెలియదు. కానీ, అభిమానం అనే ఒకే ఒక్క విషయం బెంగుళూరు, హైదరాబాద్ ను కలిపేసింది. ఒరేయ్.. ఇక్కడకు రారా చూసుకొందాం.. అక్కడికి రారా చూసుకొందాం అంటూ ఒకటే ట్వీట్స్ తో ట్విట్టర్ రచ్చరచ్చ అవుతుంది. ఇక మరికొందరు హీరోలు హీరోలు బాగానే ఉన్నారు.. మీకెందుకురా ఇవన్నీ అని హితబోధనలు చేస్తున్నారు. ఇంకొందరు ఓరీ మీ దుంపలు తెగ.. ఫ్యాన్స్ వార్ అని పచ్చిగా తిట్టుకుంటారేంటిరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరికొంతమంది అయితే బోర్ కొడుతోంది కొట్టుకుంటున్నారా..? లేదా అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఈ ఫ్యాన్ వార్ ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.