ఆదిపురుష్ రిలీజ్ కి ముందు రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటూ హంగామా చేసారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీతో పాటు థియేటర్లో సలార్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని థియేటర్స్‌లో సలార్ టీజర్ స్క్రీనింగ్ ఉంటుందని ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసారు. ఆదిపురుష్ రిలీజ్ కోసం ఇన్ని రోజులు సలార్ ని హోల్డ్ చేసారు. ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు. సలార్ టీజర్ కోసం ఎంతో ఆశగా వెయిట్ చేసిన ఫాన్స్ కి నిరాశ తప్పలేదు.
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సలార్ సినిమా ప్రమోషన్స్ కి ఇక చిత్ర యూనిట్ మొదలుపెట్టాల్సి ఉంది. ఆదిపురుష్ రిజల్ట్ తేడా కొట్టినా, కలెక్షన్స్ వీక్ అయినా దాని ఇంపాక్ట్ మాత్రం సలార్ పై పడే అవకాశమే లేదు. ప్రభాస్ ముందు సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండానే సలార్ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించగలదు. అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ ఉంది కాబట్టి మేకర్స్ సలార్ సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ ప్లాన్డ్ గా చేసుకుంటే చాలు ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని మాస్ హిస్టీరియాని చూడడం గ్యారెంటీ.