యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మిర్చి ఎప్పుడూ ప్రత్యేకమే. కొరటాల శివ దర్శకుడిగా పరిచయమైనా ఈ సినిమా అటు ప్రభాస్ కి, ఇటు కొరటాలకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కొరటాల అపజయాలను ఎరుగని దర్శకుడిగా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నారు. ఇక తాజగా ఈ కాంబో రిపీట్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ప్రభాస్ తో కొరటాల శివ భేటీ అయ్యినట్లు సమాచారం. ఎప్పటినుంచో ఈ కాంబోలో మిర్చి లాంటి సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం అభిమానుల కోరిక తీరేలా ఉంది. ప్రభాస్ ని కలిసిన కొరటాల ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని డార్లింగ్ వినిపించడం, ఆ కథకు ఇంప్రెస్స్ అయ్యి డార్లింగ్ కూడా ఓకే చెప్పడం జరిగిపోయాయి అంట. త్వరలోనే ఈ కాంబో అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మాత్రం కొద్దిగా టైమ్ పడుతుంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, మారుతీ సినిమాను పూర్తి చేయాలి, ఇటు పక్క కొరటాల ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ సినిమాలను పూర్తి చేయాలి. ఇవన్నీ పూర్తయ్యాక కానీ ఈ సినిమా పట్టాలెక్కదు. ఏదిఏమైనా ఈ మిర్చి కాంబో మీద అంచనాలు మాత్రం భారీ రేంజ్ లో పెట్టుకున్నారు అభిమానులు.