Sailaja Reddy: చిరంజీవి పేరు చెప్పి వెనక్కి నెట్టేస్తున్నారు.. చిత్రపురి కాలనీ ఫౌండర్ ప్రభాకర్ రెడ్డి కూతురు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sailaja Reddy: ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవరు అంటే.. టక్కున చిరంజీవి అని చెప్పుకొచ్చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా చిరు ముందుంటాడు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇట్టే చేసేస్తాడు. ఇటీవలే చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మాణం చేయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అంతకుముందే తాము చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించడానికి ప్లాన్ చేశామని, కానీ, కొందరు చిరంజీవి పేరు చెప్పి మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారని చిత్రపురి కాలనీ ఫౌండర్, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి కుమార్తె శైలజా రెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి.. సినిమాల్లో నటిస్తున్నప్పుడే.. కార్మికులకు మంచి ఇళ్లు ఉండాలనే సంకల్పంతో తనవంతు సాయంగా చిత్రపురి కాలనీ స్థలాన్ని వారికి రాసిచ్చారు. ఆ తరువాత ఆయన పేరుమీదనే అక్కడ కార్యక్రమాలను నిర్వహించేవారు. ఇక ఇటీవల జరిగిన ఎంఐజీ హెచ్ ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశాల మహాత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ కార్యక్రమానికి ఫౌండర్ అయిన ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆహ్వానం లేదట. ఈ విషయాన్నీ శైలజా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
” చిత్రపురి కాలనీ ఫౌండర్ ప్రభాకర్ రెడ్డి మా నాన్నగారు.. ఆ కాలనీ కోసం నాన్న ఎంత కృషి చేశారో మాకు బాగా తెలుసు..ఎంఐజీ హెచ్ ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశాల మహోత్సవానికి మమ్మల్ని పిలవకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మా అమ్మగారు చాలా బాధ పడ్డారు. ఫౌండర్స్ మీరు లేకుండా గృహ ప్రవేశాలు ఏంటి అంటూ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటే తట్టుకోలేక కమిటీ వారికి ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. ఇక చిరంజీవి గారి కన్నా ముందే మేము అక్కడ హాస్పిటల్ నిర్మించాలని అనుకున్నాం. అందుకు కమిటీ సభ్యులను కూడా కలిసి మాట్లాడం.. కానీ, వారు చిరంజీవి గారి పేరు చెప్పి మమ్మల్ని వెనక్కి నెట్టేశారు. ఎందుకంటే.. చిరంజీవి గారి వెనుక ఉంటే వారికి కూడా పేరు వస్తోంది. అందుకే మమ్మల్ని పట్టించుకోలేదు” అంటూ ఆమె వాపోయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్పై తగ్గింపు.. పెట్రోల్పై పెంపు..!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!