హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై క్లారిటీ ఇచ్చారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, అలాగే కోట్ల…
చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ గురించి టాలీవుడ్ వర్గాల వారికి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒకటి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారు. Also Read : Film Chamber : ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి.. మీడియా ముందుకు నిర్మాతలు మీడియా, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు,…
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు. వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ “1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్ట్‌కు షఫైర్ సూట్ పేరుతో మొదలుపెట్టాం. పెండింగ్‌లో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత.…
ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేవేయడమే లక్ష్యంగా హైడ్రా దూసుకువెళుతోంది. చెరువులు, కుంటలు కబ్జా చేసి విలాసావంతమైన ఆకాశఆర్మాలు నిర్మించిన అక్రమార్కుల అంతు తేల్చేందుకు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను రూపొందించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా సినీనటుడు అక్కినేని నాగార్జునాకు చెందిన N కన్వెన్షన్ ను హైడ్రా నేలమట్టం చేసింది. తుమ్మిడి కుంట చెరువు మూడు ఎకరాలు ఆక్రమించి నిర్మించిన భారీ ఫంక్షన్ హాలును కూల్చేశారు హైడ్రా అధికారులు.…
Sailaja Reddy: ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవరు అంటే.. టక్కున చిరంజీవి అని చెప్పుకొచ్చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా చిరు ముందుంటాడు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇట్టే చేసేస్తాడు. ఇటీవలే చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మాణం చేయిస్తున్నట్లు ప్రకటించారు.
తెరపై ప్రతినాయకునిగా భయపెట్టినా, నిజజీవితంలో ఎంతో సౌమ్యులు, పది మందికి మేలు చేయాలని తపించేవారు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి. ఆ తపనతోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వస్తున్న సమయంలో సినీకార్మికుల పక్షాన నిలచి ముందు వారికి నివాసస్థలాలు ఇవ్వాలని పట్టు బట్టి మరీ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో నేడు అతి ఖరీదైన ప్రాంతంగా నెలకొన్న మణికొండలో సినీకార్మికుల గృహసముదాయం వెలసింది. దానికి ‘డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర…
చిత్రపురి కాలనీ అభివృద్ధికి అడ్డుపడవద్దని ప్రస్తుత అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు సభ్యులు కోర్టుల్లో కేసులు వేసి, ధర్నాలు చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని శనివారం పాత్రికేయ సమావేశంలో ఆరోపించారు అనిల్. ఈ సమావేశంలో కోశాధికారి మహానంద రెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు అళహరి, కొంగర రామకృష్ణ, అనిత, లలిత, బత్తుల రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ ‘మా కమిటీ 2020 డిసెంబర్ లో ఎన్నికయింది. అప్పటి…
”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు. ఈ…
చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో ప్రముఖ నటులు, స్వర్గీయ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్ట్ 15న జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు ఎన్. శంకర్, చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కోశాధికారి మహానందరెడ్డి, ఫెడరేషన్ సెక్రటరీ పీఎస్ఎన్ దొర, ఇతర కమిటీ సభ్యులు, ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మి, కుమార్తెలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ…