ప్రస్తుతం స్టార్‌లు అందరూ ఒక పక్క సినిమాలు.. మరోపక్క ప్రకటనలు చేస్తూ రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒక పెయిడ్ ప్రమోషన్ చేసి నెటిజనుల ట్రోల్ కి గురైంది. ఆల్కహాల్ ప్రమోషన్స్ పూజాకి కొత్త కాదు.. అంతకుముందు కూడా చాలా సార్లు అమ్మడు బ్రాండ్ గురించి మాట్లాడింది. ఇక తాజాగా మరోసారి బుట్టబొమ్మ ఆల్కహాల్ ప్రమోషన్ లో కనిపించింది. జానీ వాకర్ రెడ్ లేబుల్ బ్రాండ్ ని గ్లాస్ లో పోసి, ఐస్ కూబ్స్ వేసి కలుపుతూ డాన్స్ చేసింది. అంతేకాదండోయ్ హుక్ స్టెప్స్ వేసిమరీ అదరగొట్టింది.. ఆ హుక్ స్టెప్ ని ఇమిటేడ్ చేస్తూ జానీ వాకర్ రెడ్ లేబుల్ బ్రాండ్ ని ప్రమోట్ చేయాల్సిందిగా అభిమానులను కోరింది.
అలా చేసినవారికి మంచి బహుమతి కూడా ఇస్తానని చెప్పింది. ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నవారికి ఒక చిన్న సందేశం కూడా తెలిపింది. కేవలం 25 ఏళ్లు నిండిన వారికే అని.. బాధ్యతాయుతంగా డ్రింక్ చేయాలని తెలిపింది. ఇకపోతే ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.. జానీ వాకర్ లో చీప్ బ్రాండ్ అయిన రెడ్ లేబుల్ ను కలుపుతూ కనిపించడంతో.. పూజా నీది ఇంత చీప్ టేస్ట్ అనుకోలేదు అని కొందరు.. ఒక స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి మద్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా..? అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.