తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీతో పాటు అక్కినేని నాగార్జున మరికొందరిపై కీలకమైన సీన్స్ ను వైజాగ్ షెడ్యుల్ లో ఫినిష్ చేసాడు కనగరాజ్. ఇక ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరిపై సీన్స్ ను షూట్ చేస్తున్నారు.
Also Read : Anaganaga OkaRaju : అక్కడ ‘అనగనగా’ షూటింగ్.. రిలీజ్ ఎప్పుడనగా.?
ఇప్పటికే ఈ సినిమాలో హస్కి బ్యూటీ శృతి హాసన్ నటిస్తుండగా తాజాగా మరొక యంగ్ భామను తీసుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన పూజా హెగ్డే ఇప్పుడు కూలీ సినిమాలో నటిస్తోంద తెలియజేస్తూ పూజా పోస్టర్ రిలీజ్ చేసారు. పూజా హెగ్డే ఇటీవల వరుస తమిళ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒకవైపు సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న రెట్రోలో హీరోయిన్ గా ఫిక్స్ అవగా లారెన్స్ డైరెక్షన్ లో కాంచన 4లోను నటిస్తుంది. లేటెస్ట్ గా కూలీ లో నటిస్తుంది. తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా ఉంటుంది, టాలీవుడ్ కు నో చెప్పి బాలీవుడ్ లో జై కొట్టి తీరా అక్కడ ఫ్లాప్స్ రావడంతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే కూలీలో స్పెషల్ సాంగ్ లో నటిస్తుందా లేక ఏదైనా ముఖ్య పాత్ర అన్నది క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.