Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. మరో హాఫ్ సెంచరీ పూర్తి.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి టీ20లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్, నేటి మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతమైన ఆటతీరుతో మరో అర్ధశతకం పూర్తి చేసుకుని తనేంటో నిరూపించుకున్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (2) త్వరగానే అవుటైనప్పటికీ, ఒత్తిడికి లోనుకాకుండా వైభవ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. క్రీజులో ఉన్నంతసేపు జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడుతూ, మైదానం నలుమూలలా దర్శనీయమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ తన సహజసిద్ధమైన దాడిని కొనసాగిస్తూ భారత్‌కు బలమైన పునాది వేశాడు.
Also Read
- CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
- Pakistan: ముస్లింలకు ముప్పుగా "హిందూ-యూదు కూటమి".. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
- Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
- AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
ఈ క్రమంలో రెండో వికెట్‌కు ఇషాన్ కిషన్‌తో కలిసి వైభవ్ 75 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 29 పరుగులు) డ్రింక్స్ సమయం ముగిసిన వెంటనే సికందర్ రజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇషాన్ వికెట్ పడినా, ఒకవైపు వైభవ్ సూర్యవంశీ క్రీజులో గట్టిగా నిలబడటంతో 10.1 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
తొలి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్, ఈ మూడో టీ20లోనూ తన నిలకడైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాటింగ్ లైనప్‌లో తన ప్రాధాన్యతను చాటుకున్నాడు. ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్, వైభవ్ ఇచ్చిన ఈ మంచి ఆరంభంతో భారీ స్కోరు సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
-
Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
-
AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!