సినీ సెలెబ్రటీలు రోజు ఎదో ఒక వ్యవహారంలో వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ లో పలువురు నటీనటులకు ఈడీ సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక సినీ నటుడిపై కేసు నమోదు అయింది. వివరాల్లోకెళితే సినీ నటుడు యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్లో ప్లాటు ఉంది. అయితే ప్రస్తుతం లిటికేషన్ లో ఉంది. అయితే రాజీవ్ కనకాల ఆ ప్లాట్ ను టాలీవుడ్ సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించాడు. ఆ ప్లాటు అమ్మిన వ్యవహారంలో రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసుల నోటీసులు జారీ చేసారు.
Also Read : HHVM : వీరమల్లు ఓవర్సీస్ రివ్యూ.. అద్భుతం
రాజివ్ ప్లాట్ ను కొనుగోలు చేసిన నిర్మాత విజయ్ చౌదరి ఆ ప్లాట్ ను మరొక వ్యక్తి రూ. 70 లక్షలకు విక్రయించాడు. తీరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూడగా అసలు వ్యవహారం బయటకు వచ్చింది. రాజీవ్ కనకాల చాలా తెలివిగా లిటికేషన్ ప్లాట్ ను విజయ్ చౌదరికి విక్రయించేసాడు. కానీ విజయ్ చౌదరి వద్ద కొనుగులు చేసిన వ్యక్తి తన పేరమార్చుకోవాలనుకోగా అసలు అక్కడ ఫ్లాట్ లేదని విషయం బయటపడింది. తాము మోసపోయామని గ్రహించిన సదరు వ్యక్తి విజయ్ చౌదరిపై హయత్నగర్లో కేసు నమోదు చేసారు. విజయ్ చౌదరిని విచారించిన పోలీసులకు తానూ రాజీవ్ కనకాల వద్ద కొనుగోలు చేసామని తెలిపాడు. రాజివ్ కనకాల తమను మోసం చేసాడని ఫిర్యాదు చేసాడు. లేని ప్లాటును ఉన్నట్లు చూపి మోసం చేశారని కేసులో సినీనటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు నోటీసులు. అందజేశారు.