పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచుసిన హరిహర విరమల్లు మొత్తానికి థియేటర్స్ లో అడుగుపెట్టింది. ప్రీమియర్స్ తో విడుదలైన హరిహర ఓవర్సీస్ ఆడియెన్స్ రివ్యూ ఎలా ఉందంటే.. హరిహరవీరమల్లు ఒక పేలవమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ కు అంతే ఓల్డ్ స్కూల్ స్క్రీన్‌ప్లేతో చూసేందుకు భారంగా ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ ను బాగానే హ్యాండిల్ చేసారు. పవర్ స్టార్ టైటిల్ కార్డుతో ఫ్యాన్స్ కు జోష్ తెప్పించిన దర్శకుడు పవర్ స్టార్ ఎంట్రీ, కుస్తీ ఫైట్ వంటి సన్నివేశాలతో ఆ హైని అలానే మెయింటేన్ చేయగలిగాడు. స్క్రీన్‌ప్లే ఓల్డ్ స్కూల్ అయినా కూడా ఆస్కార్ విన్నెర్ కీరవాణి నేపథ్య సంగీతంతో అదరగొట్టాడు. మిషన్ కోహినూర్ తో ఇంటర్వెల్ కార్డ్ వరకు పర్లదు బానే ఉంది అనిపిస్తుంది.
ఎప్పుడైతే సెకండాఫ్ మొదలైందో అక్కడి నుండి సినిమా పూర్తిగా గాడి తప్పుతుంది. దర్శకుడు కథాంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కొన్ని ఎలివేట్ సన్నివేశాలను ఒక్కక్కటిగా పేర్చుకుంటూ వెళ్లినట్టు అనిపిస్తుంది. దర్శకత్వ అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. కోహినూర్‌ను కోసం గోల్కొండ నుండి ఢిల్లీకి హీరో ప్రయాణం ఎంత బోరింగ్ అంటే ఫ్యాన్స్ కూడా ఆపేయండనిపించేలా అనిపించింది. ఇక VFX సంగతి సరేసరి. చాలా సన్నివేశాలు, ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు అయితే విసిగించేస్తాయి. అసలు డబ్బింగ్ పవన్ కళ్యాణ్ సహా అనేక పాత్రలకు చెప్పిన డబ్బింగ్ కూడా లిప్-సింక్ లేదంటే మేకర్స్ ఎంత బాధ్యతగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక క్లైమాక్స్ ఏమంత ఇంప్రెసివ్ గా ఉండదు. ఎం ఎం కీరవాణి, పవన్ కళ్యాణ్, తోట తరణి ఈ ముగ్గురు తమ వంతు న్యాయం చేశారు. ఓవరాల్ గా చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ క్రిష్ దర్శకత్వం వహించి.. సెకండాఫ్ ను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసినట్టు ఉంది. హరిహర.. వీరముల్లు..